భద్రాచలం: చిరువ్యాపారులకు రోటరీ చేయూతనివ్వడం అభినందనీయం: భద్రాచలం asp అంకిత్ కుమార్ సంఖ్వార్
చిరువ్యాపారులకు రోటరీ చేయూతనివ్వడం అభినందనీయం అని భద్రాచలం ఏయస్పీ అంకిత్ కుమార్ సంఖ్వార్ అన్నారు.శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో గల యెస్ కన్వెర్ష న్ హల్ లో పేద చిరు వ్యాపారుల జీవనోపాధి కోసం తోపుడు బండ్లను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు, టీ లు కాఫీలు టిఫెన్లు అమ్ముకుని జీవనం సాగించే లబ్ధిదారుకు సేవలు అందించడం పట్ల అభినందించారు .