ఇల్లందు: ఇల్లెందు న్యాయవాదుల ఆధ్వర్యంలోని రిలే నిరాహార దీక్షలు
న్యాయవాద రక్షణ చట్టాo అమలుకై రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఇల్లందు బార్ అసోసియేషన్.ఇల్లందు లో మంగళవారం ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో న్యాయవాదులపై దాడులు పరిపాటిగా మారాయి.అనునిత్యం కక్షిదారుల కొరకు మరియు వివిధ వర్గాల ప్రజల కోసం పాటుపడే న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో న్యాయవాద రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపుమేరకు ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టినారు.