మహిళలకు రక్షణ భద్రత కల్పించాలని జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్లూ) మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతి డిమాండ్ చేశారు. రాయదుర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. అనంతరం ప్ల కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.