నగరంలోని బ్రాహ్మిన్స్ స్ట్రీట్ లో ఓ మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నo పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Mar 4, 2026
అనంతపురం నగరంలోని బ్రాహ్మిన్స్ స్ట్రీట్ లో అశ్విని అనే మహిళ వరకట్న వేధింపులు తాళలేక బుధవారం సాయంత్రం 4:30 సమయంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 2006 లో ఆమెకు వివాహమైనా.. ఎన్నో ఏళ్లుగా ఆమెను కట్నం కావాలంటూ భర్త వేధింపులు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా అశ్విని భర్తతో విడిపోయి పుట్టింటిలో అమ్మ వాళ్లతో కలిసి ఉంది. అయినా భర్త ఆమెను ఎన్నో విధాలుగా కించపరుస్తూ నిందలు మోపుతూ వేధిస్తూ వస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఆమె గతంలో ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వమని ఎన్నోసార్లు మనవి చేసినా స్పందన లభించకపోవడంతో పలుమార్లు పోలీస్ స్టేషన్లు ఆశ్రయించింది.