మేడ్చల్: కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై అధికారులపై సీరియస్ అయిన ఈటెల రాజేందర్
కొంపల్లి ఫ్లై ఓవర్ పనుల ఆలస్యంపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్స్ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ట్రాఫిక్ కష్టాలపై దృష్టి పెట్టిన ఈటెల రాజేందర్ ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగవంతం చేయాలని, కొత్త ఫ్లై ఓవర్ స్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గద్కరిని కలిసిన ఈటెల రాజేందర్ సోమవారం కొంపల్లి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. 2022 ఏప్రిల్ లో ఈ ఫ్లైఓవర్ పనులు మొదలయి మూడేళ్లు పూర్తయ్యాయని, కానీ ఫ్లై ఓవర్ పనులు మాత్రం పూర్తి కాలేదని,పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని,ప్రజలు తమ ఫోటోలను పట్టుకొని ధర్నాలు చేస్తున్నారని అన్నారు.