శ్రీకాకుళం: రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ మహేశ్వరెడ్డి
జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్.పి మహేశ్వరెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పలు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్. పి మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను ఆరా తీసి, నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు.