వైరా: జూలూరుపాడులో రామాలయం నుంచి గోటి తలంబ్రాలతో భక్తుల శోభాయాత్ర
Wyra, Khammam | Mar 10, 2025 సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతం నుండి జూలూరుపాడు లో రామాలయం నుండి గోటి తలంబ్రాలతో భక్తుల శోభాయాత్ర కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధల
నడుమ ఘనంగా నిర్వహించారు.
జూలూరుపాడు రామాలయంలో నెలరోజుల పాటు చేతి వేళ్ళతో ఒలసిన గోటి తలంబ్రాలతో పాటు ఉత్సవ విగ్రహాలను వాహనంలో ఉంచి దేవాలయం నుండి పురవీధుల్లో ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈనెల 15 వ న జూలూరుపాడు నుండి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లి గోటి తలంబ్రాలను భద్రాచలం రాముల వారి దేవాలయంలో అప్పగించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో