కామేపల్లి: మేమున్నం ధైర్యంగా ఓటేయండి: సీఐ తిరుపతిరెడ్డి
ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. కామేపల్లి మండలంలోని సమస్యాత్మకమైన బర్లగూడెం గోవింద్రాల, పండితాపురం గ్రామాలలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ధైర్యంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు వేయాలని, తాము అండగా ఉంటామని అన్నారు.