భీమిలి: జోన్2 ప్రధాన రహదారులలో ఆక్రమణలు తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం
నగరంలోని ప్రధాన రహదారులలోని ఆక్రమణలను తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 2వ జోన్ 7వ వార్డు పరిధిలోని ఎండాడ రోడ్డు, మిథిలాపురి ఉడా కాలనీ ప్రధాన రహదారిని జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రధాన రహదారులలోని ఆక్రమణలు తొలగించాలని, అభివృద్ధి పరుస్తున్న ఎండాడ రోడ్డు, మిథిలాపురి ఉడా కాలనీ ప్రధాన రహదారిని పరిశీలించి, ఈ రహదారిలో ఉదయం 7 గంటల లోపు పారిశుధ్య పనులు నిర్వహించాలని ఆదేశశించారు.