మార్కాపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు ఇవ్వాలని తెలియజేశారు.