జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (ఐసిడిఎస్), మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమీక్షను, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, జిల్లాస్థాయి మిషన్ శక్తి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పీహెచ్సీ, అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఐఈసి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు.