క్యూలైన్లో కాలినడకన వెళ్లి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ
దసరా ఉత్సవాలను పురస్కరించుకొని సామాన్య భక్తుడి మాదిరిగా ఇంద్రకలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను క్యూ లైన్ లో కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు. సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్లు బాగున్నాయని ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని అభినందించారు.