రాజేంద్రనగర్: పాఠశాలల బస్సులను తనిఖీ చేసిన గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు
గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు పాఠశాలల బస్సులను మంగళవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఇటీవల బస్సు ప్రమాదాలు తరచూ జరుగుతుండడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎవరూ మద్యం తాగి పట్టుబడలేదని స్పష్టం చేశారు.