డి.హిరేహాల్ మండల కేంద్రంలో గోల్డ్ షాపు, వైన్ షాపుల్లో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి దొంగలు షాపుల వెనుకవైపు వెంటలేటర్ కిటికీ పగలగొట్టి లోపలలికి ప్రవేశించారు. ఏఆర్ బళ్లారి జువెలర్స్ లో 8 కిలోల వెండి 3 గ్రాముల బంగారం, 7500 నగదు దోచుకెళ్లారు. అలాగే పక్కనే ఉన్న వైన్ షాపులోని క్యాస్ కౌంటర్ లోని 4 లక్షలు నగదు, బ్రాందీ బాటిల్ కేసులు దొంగలించినట్లు షాపుల నిర్వాహకులు తెలిపారు. గురువారం ఉదయం షాపులకు వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘనపై దర్యాప్తు చేపట్టారు.