తడ హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
తిరుపతి జిల్లా తడ మండలంలోని జాతీయ రహదారిపై గురువారం ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని తడ పోలీసులు 108 అంబులెన్స్ సాయంతో శ్రీ సిటీ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తడ ఎస్సై కొండపనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.