తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు వేమన అని, ఆయన ఆవిష్కరించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలి అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు.తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగివేమన అని జిల్లా ఎస్పీ కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలోని మూఢాచారాల నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త యోగి వేమన అని కొనియాడారు.