సిర్పూర్ టి: ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో గంగాపూర్ పుణ్యక్షేత్రంలో మన ఊరు మనసారే కార్యక్రమంలో భాగంగా వందేమాతరం గీతాలాపన
కాగజ్ నగర్ పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో గంగాపూర్ అనే పుణ్యక్షేత్రంలో మన ఊరు మనసారే కార్యక్రమంలో భాగంగా వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం లో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కే శెట్టి శంకరయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు వంగల అన్నపూర్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలియజేశారు,