నెల్లిమర్ల: విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవాలంటే ఉన్నత ఆలోచనలతో పైకి ఎదగాలి: నెల్లిమర్లలో ఏపీ ట్రాన్స్ కో సూపరింటెండెంటు శామ్యూల్
విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవాలంటే జీవితంలో ఉన్నత ఆలోచనలతో పైకి ఎదగాలని ఎ.పి. ట్రాన్స్ కో సూపరింటెండింగ్ ఇంజనీర్ శామ్యూల్ రాజు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఎంబిఎ విద్యార్థులకు `వ్యాపార అవకాశాలు` అనే అంశంపై అతిధి ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవనశైలి, ఆలోచనా దృక్పధంపై సరైన అవగాహన ఉండాలన్నారు. కాలం విలువ తెలుసుకొని విజ్ఞతతో ముందుకు సాగాలన్నారు. అందరికీ అవకాశాలు వస్తుంటాయని వాటిని సద్వినియోగం చేసుకోగలగాలన్నారు.