అసిఫాబాద్: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ASF సీఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు. ఆసిఫాబాద్‌లోని బీఈడీ కళాశాల విద్యార్థులకు బుధవారం పలు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు.