మేడ్చల్: ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డిజిపి శివధర్ రెడ్డి
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈనెల 13న జరగనున్న గోట్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం డిజిపి శివధర్ రెడ్డి పగడ్బందీ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లీయోనల్ మెస్సి హాజరుకానున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. నిర్వాహకులు, పోలీసు సిబ్బందితో కలిసి స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించారు. మ్యాచ్ కు సంబంధించిన పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.