భీమిలి: మధురవాడ లో సీఐటీయూ ఆధ్వర్యంలో చిల్లర వర్తకులు నిరసన ర్యాలీ, సీఐటీయూ నాయకులు అరెస్ట్
వెంటనే తోపుడు బండ్లు చిల్లర వర్తకులను యదావిధిగా ఎవరి వర్తకం వార్ని చేసిచేసుకో నివ్వాలని సి ఐ టీ యు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మిథిలా పురి వుడా కాలని రోడ్డు నుండి ప్రదర్శన నిర్వహించారు. కార్ షెడ్ మీదుగా లక్ష్మీవాని పాలెం మీదుగా మళ్ళీ కార్ షెడ్ కు నిర్వహించారు. కార్ షెడ్ వద్ద మానవ హారం నిర్వహించాలని వస్తుండగా పీఎం పాలెం పోలీసులు అడ్డుకుని సి ఐ టీ యు నాయకులు పీ రాజు కుమార్, డీ అప్పలరాజును అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో తోపుడు బండ్లు కార్మికులు పోలీసులను నిలదీశారు. మా బ్రతుకులను అన్యాయంగా రొడ్డుపాలు చేశారని. మాగోడు అధికారులు ట్టించుకోవాలని కోరారు.