పలమనేరు: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త అడ్డు తొలగించేందుకే హత్యాయత్నం - సీఐ మురళీమోహన్
పలమనేరు: పోలీస్ స్టేషన్ నందు ఆదివారం సిఐ మురళీమోహన్ మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. కోతిగుట్ట గ్రామంలో బిఎస్ఎఫ్ ఆర్మీ ఉద్యోగి సి.వెంకటేశులు అతని భార్య శిల్పకు పెళ్లయి సుమారు 15 ఏళ్లు అవుతోంది వీరికి ముగ్గురు సంతానం. ప్రియుడు ఎం.వెంకటేష్ తో కలిసి శిల్ప వారి అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకునేందుకు వేడి నూనె పోసి చంపాలని చూసి పరారయ్యారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వారిని పట్టుకొని చిత్తూరు సబ్ జైలుకు పంపడం జరిగిందన్నారు. ఈ ఘటనలో హత్యాయత్నం జరిగినప్పుడు ఎం.వెంకటేష్ కు పెళ్లి అయి వారమే అవడం కొసమెరుపు.