అనంతపురం నగరంలోని డిమార్ట్ ఎదుట ఉన్న నంబూరి వైన్స్ ను తగలబెట్టిన ఘటనకు సంబంధించి శుక్రవారం ఉదయం హైడ్రామా కొనసాగింది. ఈ ఘటనలో అఖిల్ కుమార్ తో పాటు బాబా ఫక్రుద్దీన్ అనే ఇద్దరు శుక్రవారం ఉదయం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మరొకరు పోలీసుల అదుపులో ఉన్న అతనిని చూపలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.