చీపురుపల్లి: చీపురుపల్లి లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జమ్మ ఆదినారాయణ నామినేషన్ దాఖలు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జమ్ము ఆదినారాయణ గురువారం మధ్యాహ్నం చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయం లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీవో బి శాంతి కి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం రాజకీయాలలో ఉంటూ ఎటువంటి పదవులు, లాభం ఆశించకుండా ప్రజలకోసం పాటు పడిన తనని గుర్తించి అధిష్టానం తనకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషం అని అన్నారు. ఎమ్మెల్యే గా తనని గెలిపిస్తే చీపురుపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.