పాణ్యం: ఓర్వకల్ మండలం ఉప్పలపాడులో శనిగ పంటపై అవగాహన నూతన రకాలపై రైతులకు సూచనలు
ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో శనిగ పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సిరియా సహా పలువురు అధికారులు నూతన రకం శనిగ పంట ప్రయోజనాలు, సాగు విధానాలు, పురుగుమందుల వినియోగం వంటి అంశాలపై రైతులకు వివరించారు. కొత్త పంట రకాలపైనా రైతులు అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు.