ధర్మారం: దొంగతుర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బొంగాని రాజేశం గౌడ్ రోజువారిలాగే బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా, ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి జారి కింద పడగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేసి చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.