వెలుగోటి వెంకట శేష వరద రాజ గోపాలకృష్ణ కుమార యాచేంద్ర 101 జయంతి వేడుకలు.. పార్టీలకు అతితథంగా పాల్గొన అభిమానులు
తిరుపతి జిల్లా వెంకటగిరి రాజా గారు అయిన వెలుగోటి వెంకట శేష వరద రాజ గోపాలకృష్ణ కుమార యాచేంద్ర 101 జయంతి వేడుకలు ఆయన మనమడు వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరి వద్ద నుండి అభిమానులతో ర్యాలీగా కైవల్యానది తీరంలో ఉన్న పెద్ద రాజా విగ్రహం వద్దకు చేరుకొని ఘనంగా నివాళులర్పింఛి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్వజ్ఞ మాట్లాడుతూ వెంకటగిరి అభివృద్ధి కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చెయ్యాలి అని చెప్పిన మా తాతల అడుగుజాడల్లో నడుస్తాని ఈ ప్రాంత ప్రజల కోసం వారి మేలు కోసం అన్ని విధాల ముందు ఉంటానని చెప్పారు.