కామారెడ్డి: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు : పట్టణంలో తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు దొంగలని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురి దొంగల ముఠాలో ఇద్దరు అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరు దొంగల వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, వెండి వస్తువులు, 5 వేల నగదు స్వాదీనం చేసుకునట్టు తెలిపారు.