నంద్యాల జిల్లాబేతంచెర్ల మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో అల్లా బకాష్ దర్గా ముందు ఉన్న కిస్తీని రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు కిస్తీ ధ్వంసం చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రహదారిపై కూర్చుని ధర్నా చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరారు.