పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను గుర్రంకొండలో అరెస్ట్, 78వేలు విలువ చేసే వస్తువులు స్వాధీనం
అన్నమయ్య జిల్లాలో పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను ఎస్ఐ బాలక్రిష్ణ సోమవారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ బి.రాఘవ రెడ్డి తెలిపారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ బాలక్రిష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ రాఘవ రెడ్డి మాట్లాడుతూ నిమ్మనపల్లి మండలం కు చెందిన ఎస్.బాలు(20),కొరువు రమేష్(29), మదనపల్లి కి చెందిన ఎదుర్ల బాలాజీ(45) అనే ముగ్గురు పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. గుర్రం కొండ పోలీస్ స్టేషన్ నందు ఒక బి.ఎన్.ఎస్ కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసు విచారణలో నిందితులు పట్టుబడ్డారు