మేడ్చల్: బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నషాముక్తి భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. డిసిపి సురేష్ కుమార్ పర్యవేక్షణలో సిఐ నరసింహారాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నర్సాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ప్రజలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజల భాగస్వామ్యంతో మాదకద్రవ్యాల నిర్మూలన కీలకమని, 2026నాటికి తెలంగాణను బ్రేక్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.