మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కోసం పుట్టిన కారణజన్ముడని తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు ఆదర్శంగా నిలిచాయన్నారు.