శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. కొందరు హద్దు మీది మాటలు మాట్లాడుతున్నారని, అలాగే కొంతమంది రిపోర్టర్లు అసత్య వార్తలు రాస్తున్నారని, ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకోమని తమ సహనాన్ని పరీక్షించొద్దని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై హద్దు మీరి మాట్లాడడంతోనే ఆయన అభిమానులకు కోపం వచ్చిందని అన్నారు.