భీమిలి: ఋషికొండ వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి
రుషికొండ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారును ద్విచక్ర వాహనం తో డీకొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది. రుషికొండ జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కారు టర్నింగ్ తిరుగుతున్న సమయంలో వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.