యాడికి మండలం కమలపాడు కు చెందిన శిల్పా 108 అంబులెన్స్ లో డెలివరీ అయింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది రవి శంకర్, గంగరాజు వెంటనే కమలపాడు కి వెళ్లారు. నిండు గర్భిణీ శిల్పాను యాడికి ఆసుపత్రికి తరలిస్తుండగా ఆసుపత్రిలోకి వెళుతుండగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.