సంస్కృతి, సంప్రాదాయాలు మరియు మన వారసత్వంను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 19, 2025
తరతరాలుగా మన పూర్వీకుల నుండి వస్తున్న సంస్కృతి, సంప్రాదాయాలు మరియు మన వారసత్వంను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు -2025లో భాగంగా హెరిటేజ్ వాక్ ను నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెరిటేజ్ వాక్ మార్గంలో వారసత్వ నడక మార్గములోని కలెక్టరేట్, విక్టోరియా హాస్పిటల్, ఆర్ట్స్ కాలేజ్, జైల్, టవర్ క్లాక్, పీస్ మెమోరియల్ హాల్ మరియు జిల్లా పురావస్తు ప్రదర్శన మార్గాన్ని సందర్శించడం అభినందనీయమన్నారు.