అనంతపురం జిల్లా బుక్కచెర్లలో ట్రాక్టర్ లోని రేడియేటర్ లో ఉన్న నీరు పడి యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ లోని రేడియేటర్లో ఉన్న నీరు పడటంతో నవీన్ కుమార్ అనే నగరానికి చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం సోమవారం సాయంత్రం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.