చీమకుర్తి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ క్రికెట్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. లక్ష, రెండవ స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు చొప్పున నగదు తోపాటు ట్రోఫీలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక వికాసానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.