అసిఫాబాద్: ప్రమాదకర మూలమలుపులతో వాహనదారుల ఆందోళన
రాళ్లు తేలిన రహదారి నోళ్లు తెరిచిన గుంతలు ASF మండలంలో దర్శనం ఇస్తున్నాయి. తుంపల్లి గ్రామం నుంచి మాలన్ గొంది గ్రామం వరకు రోడ్డు అధ్వానంగా మారింది. నిత్యం ఈ మార్గం గుండా 10 గ్రామాల ప్రజలు వివిధ పనుల రీత్యా జిల్లా కేంద్రానికి నిత్యం వాహనాల రాకపోకలను కొనసాగిస్తుంటారు. రోడ్డుపై కంకర తేలి గుంతలు పడడంతో నరకం చూస్తున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.