ఒంగోలులోని ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యాలయం నందు, జనవరిలో నిర్వహించబోయే ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యక్రమాల వివరాలకు సంబంధించిన బ్రోచర్లను బుధవారం కళాపరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా, రేపు జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మొత్తం 17 రోజుల పాటు, సంక్రాంతి పండుగ అనంతరం కళారంగానికి అంకితమైన ఒక మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.