సంగారెడ్డి: మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : మంత్రి దామోదర రాజనర్సింహ
మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. 1990లో మొదలైన మహిళా సంఘాల గ్రూపులు 2004 2014 న వడ్డీ లేని రుణాలను అందించి మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.