సిర్పూర్ టి: బెజ్జూరులో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించిన ఆరోగ్య సిబ్బంది
బెజ్జూరు మండలంలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆరోగ్య సిబ్బంది మేఘన సూచించారు. బుధవారం బెజ్జూరు మండల కేంద్రంలోని ఆదర్శ అంగన్వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేఘన సూచించారు,