వైరా: తనికెళ్ళ ఎన్ఎస్పీ కాలవలో గుర్తుతెలియని మృతి దేహం
Wyra, Khammam | Sep 23, 2025 ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల ఎన్ఎస్పి కాలంలోని, ఓ గుర్తుతెలియని మృతి దేహం కొట్టుకొని వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న కొనిజర్ల పోలీసులు మృతి దేహాన్ని ఖమ్మం అన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని, మృతి దేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. అనంతరం గుర్తుతెలియని వ్యక్తిగా స్థానికులు తెలపడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మాచురి కి తరలించారు. ఈ సందర్భంగా కొనిజర్ల ఎస్సై మాట్లాడుతూ మృతిని ఒంటిపైన నలుపు రంగు నెక్కు టీ షర్టు పూర్తిస్థాయిలో నలుపు దుస్తులు ధరించి ఉన్నట్లు వారు పేర్కొన్నారు.