పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో విషాదం చోటు చేసుకుంది. నల్లమల్ల అటవీ ప్రాంతమైన వెల్దుర్తి మండలం సిగిరిపాడు చెక్పోస్ట్ సమీపంలో రోడ్డు దాటుతున్న పెద్దపులిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దపులి అక్కడికక్కడే మృతి చెందింది. అటువైపు వెళుతున్న కొంతమంది ఈ విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టామని పెద్దపులి మృతి పై లోతుగా విచారిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.