పెడనలో చెడుగుడు పోటీలు ఉత్కంఠ భరితం, దసరా పండుగా రోజు వరకు ఈ ఆటలు సాగుతాయని తెలిపిన నిర్వాహుకులు
Machilipatnam South, Krishna | Sep 25, 2025
పెడన లో చెడుగుడు పోటీలు రెండో రోజు ఉత్కంఠ భరితం స్తానిక పెడన మండలం లంకలకలవగుంట గ్రామంలో జరుగుతున్న చెడుగుడు పోటీలు గురువారం మద్యాహ్నం 4 గంటల సమయం వరకు రెండో రోజు ఉత్కంఠ భరితంగా సాగాయి. లంకలకలవగుంట అంబెడ్కర్ టీమ్, బంగ్లా టీమ్ మధ్య జరిగిన పోటీ ఉత్కంఠ రేపగా చివరికి అంబేడ్కర్ టీమ్ విజయం సాధించింది. అదేవిధంగా తుమ్మిడి బాయ్స్ టీమ్, కొత్తూరు రైడర్స్ మధ్య జరిగిన పోటీ ప్రేక్షకులను కట్టి పడేసింది. చివరికి తుమ్మిడి బాయ్స్ టీమ్ విజయం సాధించింది. దసరా పండుగా రోజు వరకు ఈ ఆటలు జరుగుతాయని నిర్వహణ ఆధికారులు తెలిపారు.