ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి సందర్శన సందర్భంగా క్యాంపస్ లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితులు ఉధృతంగా మారకుండా పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించడంతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది.