అసిఫాబాద్: ఆసిఫాబాద్ రైతు వేదికలో బిర్సా ముండా జయంతి వేడుకలు
బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్యదైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జానకపూర్ రైతు వేదికలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. మొదటగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల భూములను వారికి తిరిగివ్వాలని తెగ పెద్దలతో కలిసి తెల్లదొరలపై బిర్సా ముండా పోరాడారని వివరించారు.