అసిఫాబాద్: గిన్నెదరిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఆదివారం తిర్యాణి మండలం గిన్నెదరి, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గిన్నెదరిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శీతల గాలుల ప్రభావం జిల్లా వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.