కొత్తగూడెం: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు అందించాలని డీజీఎం పర్సనల్‌కు సామాజిక కార్యకర్త వినతి
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ కొత్తగూడెంలో ఎస్ ఓ టు డైరెక్టర్ పా ఎస్ వరప్రసాద్ (డిజియం పర్సనల్ )కు వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగూడెం లో మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ దక్షిణాది పరిశ్రమలకు ఆయువుపట్టు సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత లలో పర్మినెంట్ కార్మికులతో పాటు సమానంగా పనిచేస్తూ సింగరేణి సంస్థకు వెన్నెముకగా నిలుస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఓబి వర్కర్లు అతి తక్కువ వేతనాలతో పని చేస్తూ బ్రతుకు బండినీ లాగుతున్నారు.