జన్నారం: మేదరులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి: మేదరి సంక్షేమ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు నర్సింగారావు
మేదరులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మేదరి సంక్షేమ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు నర్సింగారావు అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలోని రామాలయం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం బస్టాండ్లో ఉన్న మేదరి సంఘం జెండాను ఆవిష్కరించారు. మెదరుల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలని కోరారు.